ఢీల్లీ, 24 డిసెంబర్ (హిం.స)
తైవాన్, మేఘాలయ ప్రాంతాల్లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. తైవాన్ దేశంలో తక్కువ జనాభా ఉన్న తూర్పు తీరంలో ఆదివారం తెల్లవారుజామున 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని ద్వీపంలోని వాతావరణ బ్యూరో తెలిపింది. భూకంప కేంద్రం తైవాన్లోని టైటుంగ్ కౌంటీకి సముద్రంలో 16.5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు వాతావరణ బ్యూరో పేర్కొంది.
శనివారం రాత్రి 7.25 గంటలకు అయిదు కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
