


డిల్లీ:13 డిసెంబర్ (హిం.స) జనవరి నెలాఖరు నాటికి 35 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.
కృష్ణా జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారని ఆయన తెలిపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసన సభ్యత్వానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో వైకాపాలో ప్రకంపనలు మొదలయ్యాయన్నారు.
ఢిల్లీలో ఎంపీ రఘురామకృష్ణరాజు మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ మాకొద్దు అంటే మాకొద్దని ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటున్నారంటే, వైకాపా మునిగిపోయే పడవని వారికి అర్థమైందన్నారు. ప్రజా తీర్పు అధికార వైకాపాకు వ్యతిరేకమని తేలడంతో, చిల్లుపడ్డ పడవ నుంచి దూకి ఒడ్డుకు చేరుకునేందుకు చాలామంది ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోందన్నారు.
వైసీపీ అధిష్ఠానం అరాచకాలు, శాసనసభ్యులను అగౌరవపరచడం, అమానవీయంగా ప్రవర్తించడం వంటి సంఘటనలు వారిని తీవ్రంగా కలిచి వేసి, ఆ నిర్ణయానికి పురిగొల్పాయన్నారు. ప్రస్తుత శాసనసభ్యుల్లో 75 నుంచి 80 మందిని మారుస్తారని తెలిసిందని ఎంపీ అన్నారు. చిలకలూరిపేటలో పనికిరాని మంత్రి రజిని గుంటూరులో ఎలా పనికివస్తారని ఆయన ప్రశ్నించారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
