తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 1( హింస)
నగరంలో 2700కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్‌లో 1500 కేసులు, సైబరాబాద్‌లో 1241 కేసులు నమోదయ్యాయి. రాచకొండలో 517 కేసులు నమోదయ్యాయి. మొత్తం మూడు కమిషనరేట్ల పరిధిలో 3500లకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ పరిధిలో ఇద్దరు మహిళలు సహా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 1239 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపిన కేసుల్లో 938 బైక్‌లు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను సీజ్ చేశారు. పలుచోట్ల వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు జంటనగరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. నగరంలోని ఫ్లై ఓవర్లు, ఓఆర్‌ఆర్‌లను ఆదివారం రాత్రి 8 గంటలకు మూసివేశారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
