శబరిమల 06 జనవరి (హిం.స) శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో ప్రసాదానికి కొరత ఏర్పాడింది. శబరిమల ప్రసాదాన్ని ప్రత్యేక డబ్బాలలో ఇస్తారు.. అయితే, ఇప్పుడు ఆ డబ్బాలకు కొరత ఏర్పడింతో.. ప్రసాదంపై ట్రావెన్ కోర్ దేవస్థాన్ బోర్డు ఆంక్షలు విధించింది.
శబరిమలకు వచ్చే ఒక్కో భక్తుడికీ కేవలం రెండు డబ్బాలు మాత్రమే ఇస్తామని వెల్లడించింది. అయితే, అయ్యప్ప భక్తులకు 2 డబ్బాలు ఏమాత్రం సరిపోవు అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బాల కొరత, ప్రసాద పంపిణీకి అనేక చిక్కులు తెచ్చిపెడుతోంది.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
