
అమరావతి02 జనవరి (హిం.స): వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. చేసిన పాపాలు పోవాలని, సన్మార్గంలో నడిచేలా దీవించాలని భక్తులంతా శ్రీకాళహస్తీశ్వర స్వామిని వేడుకుంటారని, అధికారమదం తలకెక్కిన వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాత్రం శ్రీకాళహస్తి సన్నిధిలోనే పాపాలకు పాల్పడుతున్నాడని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
