హైదరాబాద్, 18 నవంబర్ (హి.స.) సంతానానికి ఐవీఎఫ్ (IVF) చికిత్స తీసుకుని, కవల పిల్లల కోసం ఆనందంగా ఎదురుచూస్తున్న ఆ దంపతుల జీవితం, కొద్ది గంటల్లోనే విషాదాంతమైంది.
బెంగళూరుకు చెందిన ముత్యాల విజయ్ (40), అతని భార్య శ్రావ్య (35) ఏడాదిన్నర కిందట శంషాబాద్కు వలస వచ్చి స్థిరపడ్డారు. విజయ్ ఎయిర్పోర్టులో ఉద్యోగం చేస్తున్నాడు. సంతానం లేని ఈ దంపతులు ఐవీఎఫ్ (IVF) చికిత్స ద్వారా గర్భం దాల్చారు. అందులోనూ కవలలు పెరుగుతున్నారని తెలియడంతో వారి ఆనందానికి అవధులు లేవు. అయితే, 2025 నవంబర్ 16వ తేదీ రాత్రి, శ్రావ్యకు అకస్మాత్తుగా కడుపు నొప్పి మొదలైంది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే అత్తాపూర్ లోని ఆసుపత్రికి తరలించారు. lగర్భంలో పెరుగుతున్న కవలలు ఇద్దరూ మృతి చెందారని వైద్యులు ధృవీకరించారు. ఈ తీవ్ర ఆఘాతం తట్టుకోలేక శ్రావ్య అక్కడే స్పృహ కోల్పోయింది. మెరుగైన వైద్యం కోసం ఆమెను గుడిమల్కాపూర్లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూనే శ్రావ్య తుదిశ్వాస విడిచింది.
ఈ విషయాన్ని విజయ్
జీర్ణించుకోలేకపోయారు. ఈ తీరని బాధతో సోమవారం (నవంబర్ 17) తెల్లవారుజామున శంషాబాద్లోని తమ ఇంట్లోనే విజయ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
—————
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..
