తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 5( హింస)
కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఆడిట్ ఆఫీసర్ సంగసారపు కిష్టయ్య ఏసీబీకి చిక్కాడు. మెస్ బిల్లులు చెల్లించడానికి రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కాకతీయ యూనివర్సి టీలో 2021-22, 23కు హాస్టళ్లలో పాలు, పెరుగు సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్ పెండెం రాజేందర్ టెండర్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలో మే, ఏప్రిల్‌కు సంబంధించిన రూ.9 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉండగా, అవి ఇచ్చేందుకు అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఆడిట్ ఆఫీసర్ కిష్టయ్య లంచం డిమాండ్ చేశాడు. దీంతో రాజేందర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రూ.50 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
