తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 14( హింస)
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారిని డీజీపీ రవిగుప్తా సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి స్వామి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా, స్వామి వారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2గంటలు, ప్రత్యేక దర్శనానికి దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండక్రింద విష్ణుపుష్కరణి,కారు పార్కింగ్,బస్ స్టాండ్ లో భక్తుల సందడి నెలకొంది.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
