అమరావతి, 8 జనవరి (హిం.స) అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి ఏపీ సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఓ మీడియా సంస్థ ప్రతినిధితో కలిసి విచారణకు వచ్చారు. ఓ టీవీ ఛానల్ లైవ్ డిబేట్ లో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తల తెచ్చిన వారికి కోటి రూపాయలు ఇస్తానని శ్రీనివాసరావు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై ఏపీ డీజీపీకి రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు చేశారు. వర్మ ఫిర్యాదు మేరకు కొలికపూడిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ నెల 3న సీఐడీ విచారణకు కొలికపూడి హాజరయ్యారు. ఈరోజు మరోసారి విచారణకు వచ్చారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
