







రాజమహేంద్రవరం: 04 జనవరి (హిం.స)వైసీపీ నాయకుల డ్రగ్స్ లింకులు మరోమారు బయటకు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం డిచ్‌పల్లిలో జనవరి 1వ తేదీన డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడ్డ ఇద్దరు నిందితుల్లో ఒకరు డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా జొన్నాడకు చెందిన ద్వారంపూడి విక్రమ్‌రెడ్డి కావడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేగింది. విక్రమ్‌రెడ్డి తండ్రి ద్వారంపూడి సత్యనారాయణరెడ్డి జొన్నాడ సర్పంచిగా పనిచేశారు.
కొత్తపేట నియోజకవర్గ వైసీపీ కీలకంగా వ్యవహరిస్తారు. విక్రమ్‌రెడ్డి జొన్నాడకు చెందినవారైనా రాజమహేంద్రవరం, హైదరాబాద్, అనపర్తిల్లో ఎక్కువగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటాడు. ఆధార్, ఓటు తదితరాలన్నీ జొన్నాడలో ఉన్నాయి.
రాజమహేంద్రవరం ఎంపీ భరత్ అనుచర వర్గంతో కనిపిస్తుంటారు. భరత్ కార్యాలయంలో ప్రతిరోజు కనపడే వ్యక్తులో విక్రమ్‌రెడ్డి ఒకరు. తన అత్తగారి ఊరైన అనపర్తి రాజకీయాల్లో సైతం విక్రమ్‌రెడ్డి కీలకంగా వ్యవహరిస్తారు. విక్రమ్‌రెడ్డికి వైకాపా నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలతో పరిచయాలున్నాయి.
హిందూస్టాన్ సమాచార, రాజీవ్
