






న్యూఢిల్లీ, జనవరి 6 (హిం.స): భారతీ సిమెంట్స్‌కు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసిన రూ.150 కోట్ల ఎఫ్‌డీలను విడుదల చేయాలని ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేసింది.
బ్యాంకు గ్యారెంటీలను తీసుకుని ఎఫ్‌డీలను విడుదల చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ సంజయ్ కరోల్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
దీనిపై విచారణ ముగిసిందని.. అభ్యంతరాలుంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని పేర్కొంది. బ్యాంకు గ్యారెంటీలను తీసుకున్న తర్వాత కూడా ఎఫ్‌డీలను ఈడీ జప్తు చేసుకుందని భారతీ సిమెంట్స్ తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. ఎఫ్‌డీలను జప్తు చేసినా కనీసం వాటిపై వచ్చిన వడ్డీనైనా విడుదల చేయాలంటూ ఆ సంస్థ దాఖలు చేసిన మరో పిటిషన్‌పైనా హైకోర్టుకే వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
