తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 5( హింస)
బస్సుల్లో ఆటో డ్రైవర్ల భిక్షాటన చేస్తున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు రూ.100 కూడా సంపాదించలేక పోతున్నామని వాపోతున్నారు. కుటుంబం గడవాలని ఆటోలు తీసుకుని బతుకుతున్న మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఫ్రీ బస్సు సర్వీసులు ఏర్పాటు చేసిందని మండిపడుతున్నారు. తమ ఆవేదనను ప్రభుత్వానికి చెప్పిన స్పందించలేదని వాపోతున్నారు. ఇళ్లు గడవాలంటే చాలా ఇబ్బందిగా మారిందని అందకే వినూత్నంగా భిక్షాటన చేస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా ఆటోడ్రైవర్ల ఆవేదనను ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నారు. జీవనోపాధికి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఆటోలు వేసిన అందులో ఒకరో ఇద్దరు ఎక్కడం వలను ఇబ్బందిగా తయారైందని వాపోతున్నారు. సంక్రాంతి పండుగ వస్తున్నా ఆటోవాలా ఇళ్లల్లో ఆనందం కరువైందని కన్నీరుమున్నీరవుతున్నారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
