తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 3( హింస)
నేడు కాకినాడలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. కాకినాడ పర్యటన కోసం ఇవాళ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. నేరుగా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వహించబోయే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం సభలో.. వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
