తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 19( హింస)
ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోలుకుంటున్నారు. శుక్రవారం ఉదయం ఆయనకు వెంటిలేషన్ తొలగించారు. తమ్మినేనితో కుటుంబ సభ్యులు మాట్లాడారు. పార్టీ ప్రముఖ నాయకులు వీరభద్రంను పరామర్శించారు. కొద్ది రోజుల్లోనే తమ్మినేని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్నారని పార్టీ నాయకుడు పోతినేని సుదర్శన్ తెలిపారు. తమ్మినేనిని పరామర్శించేందుకు ఎవరూ ఆస్పత్రికి రావొద్దు.. ఎక్కువ మంది వస్తే ఆయన ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని తెలిపారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
