
హైదరాబాద్03 జనవరి (హిం.స): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ‘‘నిజం గెలవాలి’’ పేరుతో బుధవారం నుంచి మూడు రోజులపాటు పర్యటనలు కొనసాగనున్నాయి.
నిజం గెలవాలి పేరుతో వారానికి మూడు రోజులపాటు భువనేశ్వరి పర్యటనలుంటాయి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో పర్యటన కొనసాగనుంది. ఈరోజు విజయనగరం జిల్లాలో, గురువారం శ్రీకాకుళం జిల్లా, శుక్రవారం విశాఖ జిల్లాలో భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్థాపానికి గురై చనిపోయిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ఇప్పటికే ఒకసారి వెళ్లి కొన్ని కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించిన విషయం తెలిసిందే.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
