అమరావతి, 18 ఆగస్టు (హి.స.)బంగాళాఖాతం లో మరో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఎఫెక్‌తో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే చాన్స్ ఉందని స్పష్టం చేసింది. అలాగే ప్రధాన పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించింది. విశాఖ, గంగవరం, కాకినాడ, నిజాంపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ఐదురోజులు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించింది. ఇక రాష్ట్రంలోనూ వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో రెండు రోజుల పాటు వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాల సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపింది.
—————
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి
