చిత్తూరు , జనవరి 15 (హిం.స) త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బుధవారం సాయంత్రం 5 గంటలకు కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో ఎన్నికల సమావేశం జరుగనుంది.
రోల్ అబ్జర్వర్ పోలా భాస్కర్ ముఖ్యఅతిథిగా విచ్చేసే ఈ సమావేశానికి కలెక్టర్ షన్మోహన్ అధ్యక్షత వహించనున్నారు. ఈనెల 22న ప్రచురించనున్న తుది ఓటర్ల జాబితా అంశంపై రోల్ అబ్జర్వర్, ఈఆర్వో, ఏఈఆర్వో, ఎన్నికల అధికారులతో సమావేశం కానున్నారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
