తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 9( హింస)
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి మృతి కలకలం రేపుతోంది. కాగజ్ నగర్ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో ఆదివారం ఓ పులి మృతి చెందింది. కాగజ్ నగర్ టైగర్ రిజర్వ్‌లో గత రెండు నెలలుగా పులులు పలు ఆవులపై దాడి చేసి చంపిన ఘటనలు సంగతి తెలిసిందే.. అయితే ఆదివారం దరిగాం అటవీ ప్రాంతంలో పులి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. గ్రామస్తుల సమాచారంతో సీసీఎఫ్ శాంతా రాం, అటవీశాఖ అధికారులతో సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దరిగాం అటవీ ప్రాంతంలో మూడు రోజుల వ్యవధిలోనే రెండు పులులు మృతి చెందాయి. టెరిటోరియల్ ఫైట్ లో ఒక పెద్దపులి మృతి చెందగా ఆ ప్రాంతం సమీపంలో మూడు సంవత్సరాల వయసు గల మరో పులి కళేబరాన్ని అటవీ అధికారులు గుర్తించారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
