అమరావతి, 18 ఆగస్టు (హి.స.)ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి విశేష స్పందన లభిస్తోంది. వారాంతపు సెలవులు ముగియడంతో ఆదివారం బస్టాండ్లన్నీ కిటకిటలాడాయి. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో బస్సులు ఎక్కడానికి మహిళలు పోటెత్తారు. ఆదివారం ఒక్కరోజే విజయవాడ సిటీ బస్సుల్లో 80శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఉదయం నుంచి రాత్రి వరకూ రద్దీగానే ఉంది. ఇక్కడినుంచి సాధారణంగా రోజుకు 32వేల మంది మహిళలు ప్రయాణిస్తారని అంచనా. అయితే ఆదివారం దాదాపు 50వేల మంది వరకూ మహిళలు ప్రయాణం చేసినట్టు జిల్లా ఆర్టీసీ అధికారి ఏలూరి సత్యనారాయణమూర్తి తెలిపారు.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
