

అల్లవరం, 31 డిసెంబర్ (హిం.స(: క్రీడాకారులు ధరించాల్సిన ‘ఆడుదాం ఆంధ్రా’ లోగో ఉన్న టీషర్టు, టోపీ ఓ అధికారి ధరించడం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చర్చనీయాంశమైంది.
‘ఆడుదాం ఆంధ్రా’ మండల స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ప్రత్యేక లోగోలతో తయారు చేసిన టీషర్టులు, టోపీలు ఇవ్వనున్నారు. అవి శనివారం అల్లవరం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చాయి. అందులో ఓ టీషర్టు, టోపీని ఎంపీడీవో కృష్ణమోహన్ ధరించారు.
ఆ దుస్తుల్లోనే విధులకూ హాజరయ్యారు. ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. అధికారా లేక ‘ఆడుదాం ఆంధ్రా’కు బ్రాండ్ అంబాసిడరా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
