అల్లూరి సీతారామరాజు జిల్లా 12 డిసెంబర్ (హి.స.)
, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్‌లోఇవాళ(శుక్రవారం) తెల్లవారు జామునబస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా.. 20మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ బస్సు ప్రమాదంపై ఎప్పటికప్పుడు అధికారులతో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ సమీక్షిస్తున్నారు.
అన్నవరం నుంచి అరకు మీదుగా భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఇవాళ(శుక్రవారం) తెల్లవారు జామున ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. బస్సులో ఉన్న వారిలో ఇప్పటివరకు 10 మంది చనిపోయారని తెలిపారు. మొత్తం 22 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని వివరించారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పుకొచ్చారు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో బస్సు.. లోయలో పడి పలువురు యాత్రికులు మృతిచెందడం చాలా బాధాకరమని తెలిపారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందజేసేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన వారి ఆత్మ శాంతించాలని భగవంతుడును ప్రార్థిస్తున్నానని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు కిషన్‌రెడ్డి.
యాత్రికులతో కూడిన బస్సు చింతూరు – మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడిపోయిందని అధికారుల ద్వారా తెలుసుకున్నానని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో 22 మంది గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుందని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
