

అల్లవరం, 31 డిసెంబర్ (హిం.స) రానున్న ఎన్నికల్లో అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి తాను కచ్చితంగా పోటీ చేస్తానని రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ స్పష్టం చేశారు. శనివారం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని కోడూరుపాడులో ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘ఎన్నికల్లో గెలిచే వారికే సీఎం జగన్ టికెట్లు ఇస్తారు. టికెట్లు దక్కని వారికి అధికారంలోకి వచ్చాక వివిధ పదవులు ఇస్తారు. ఆరోపణలు, ప్రజావ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వనని సీఎం తెలిపారు. స్థానికులకే కేటాయిస్తారని ఆశిస్తున్నామ’అన్నారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
