






విజయవాడ:6 జనవరి (హిం.స) అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. హెచ్ నర్సింగరావు డిమాండ్ చేశారు.
శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ… అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు. అంగన్వాడీలపైన ఎస్మాను ప్రయోగించడం అంటే యావత్ కార్మికులు, ప్రజల ప్రజాతంత్ర హక్కులపై దాడి చేయడమేనని చెప్పారు.
ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 7వ తేదీన ఉదయం అన్ని జిల్లా కేంద్రాలు, పారిశ్రామిక కేంద్రాలు, ఆఫీసుల వద్ద పరిశ్రమల వద్ద ఎస్మా జీవో కాపీలను దగ్ధం చేస్తామని పిలుపునిచ్చారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
