అమరావతి:08 ఫిబ్రవరి (హిం.స) ఇవాళ స్పీకర్ ముందుకు వ్యక్తిగతంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. వ్యక్తిగతంగా స్పీకర్‌కు వివరణ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాతపూర్వకంగా తమ వివరణను ఆనం రానారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఈ నెల 5న సమర్పించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం తనకు నోటీసులు అందలేదని చెప్పారు. తనకు నోటీస్ అందిన వెంటనే వివరణ పంపుతానని కోటంరెడ్డి స్పష్టం చేశారు. నేడు ఎమ్మెల్యేల వివరణ తర్వాత అనర్హతపై స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకోనున్నారు.
