విజయవాడ : పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్‌లో కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం ( నిర్వహిస్తున్నారు. సుజనాతో కలిసి వంగవీటి రాధాకృష్ణ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో సుజనా చౌదరికి మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. కొన్ని ప్రధాన సమస్యలను సుజనాకు సీనియర్ సిటిజన్స్ వివరించారు. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి ప్రణాళికను త్వరలోనే ప్రకటించి అమలు చేస్తామని బీజేపీ అభ్యర్థి హామీ ఇచ్చారు.
