అనంతపురం: 15 ఫిబ్రవరి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో నిర్వహించనున్నారు. నేడు ఆమె హిందూపురం, మడకశిర నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి నేటి ఉదయం 9 గంటలకు భువనేశ్వరి బయలుదేరనున్నారు. సాయంత్రం 4:10 గంటలకు పుట్టపర్తి, శ్రీ సత్యసాయి విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనం కానున్నారు.
