అమరావతి: 26 మార్చ్సా ర్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచే సమర శంఖం పూరించనున్నారు.
మార్చి 30 నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని ఆయన నిర్ణయించారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని, అందుకనుగుణంగానే పర్యటన షెడ్యూల్ రూపొందించాలని నేతలకు పవన్ సూచించారు.
ఈ మేరకు ఆయన సోమవారం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మూడు విడతలుగా పవన్ ప్రచారం ఉండనుంది. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ రూపొందించనున్నారు.
