తెలంగాణ మార్చి 23 : తప్పు చేసిన వారిని అరెస్టు చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు పలుమార్లు నోటీసులు ఇచ్చినా.. సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారన్నారు.దిల్లీ లిక్కర్ స్కామ్లో సాక్ష్యాలు ఉన్నాయి. ఈ కేసులో తమ కుటుంబానికి, దిల్లీ సీఎం కేజీవాల్కు సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా? మద్యం పాలసీలో దిల్లీలోని ఆప్ ప్రభుత్వం అవకతవకలు చేసింది. ఢిల్లీలో తీగ లాగితే తెలంగాణలో దొరికింది. కేజీవాల్, కవిత అరెస్టును దేశమంతా సమర్థిస్తోంది. ఈ కేసుకు సంబంధించి కేసీఆర్తో చర్చకు మేం సిద్ధం. అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తా. కేజీవాల్ తప్పు లేదని కేసీఆర్ నిరూపించగలరా? కవిత అరెస్టుకు తెలంగాణ రాజకీయాలకు సంబంధం లేదు. కేజీవాల్ అరెస్టును ఖండించిన కేసీఆర్.. కవిత అరెస్టుపై ఎందుకు స్పందించలేదు. కవిత అరెస్టు విషయంలో కేసీఆర్ మౌనానికి కారణమేంటో ప్రజలకు చెప్పాలి.
కాళేశ్వరం అవినీతిపై దమ్ముంటే సీఎం రేవంత్రెడ్డి సీబీఐ విచారణ జరిపించాలి. తెలంగాణలోని 17పార్లమెంట్ స్థానాల్లో భాజపా ఒంటరిగానే పోటీ చేస్తుంది” అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
