విజయవాడ : నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో కూటమి పార్టీల బీజేపీ సుజనా చౌదరి) విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. మంగళవారం ఉదయం అపార్ట్‌మెంట్ వాసులతో సుజనా ) ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. భవిష్యత్తు కార్యాచరణ, అభివృద్ధిపై ప్రధానంగా చర్చించారు. అలాగే కొండ ప్రాంత ప్రజలతో కలిసి పోయి వారి ఇబ్బందులు స్వయంగా తెలుసుకుంటున్నారు. విద్యుత్, డ్రైనేజి, తాగునీటి సమస్యలను సుజనాకు ప్రజలు వివరించారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పరిష్కారం చూపిస్తానని సుజనా చౌదరి ప్రజలకు హామీ ఇచ్చారు.
