విజయనగరం(ఆంధ్రప్రదేశ్), మార్చి 13 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా భోగాపురం మండలం ముంజేరు గ్రామం, నెల్లిమర్ల మండలం మల్యాడ గ్రామాలను జిల్లా ఎస్పీ ఎం.దీపికా పాటిల్, జిల్లా కలెక్టరు ఎస్.నాగలక్ష్మి సందర్శించారు. గ్రామ సభలు నిర్వహించి, సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతయుతంగా నిర్వహించేందుకు సహకరించాలని, ప్రజలు స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించేందుకు చర్యలు చేపడుతున్నామని, ప్రజలందరూ ఎన్నికల అధికారులు, పోలీసు, రెవెన్యూ అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపిఎస్ అధికారి కుమారి జావలి అల్ఫాన్స్, విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, విజయనగరం ఆర్డీఓ సూర్యకళ, ఇతర రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల తనిఖీ
జిల్లా ఎస్పీ ఎం.దీపికా పాటిల్ ఆదేశాలతో జిల్లాలో వివిధ పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు, కాపీయింగ్ జరగకుండా ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్ స్వయంగా పర్యవేక్షించారు.
