విజయనగరం(ఆంధ్రప్రదేశ్), మార్చి జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై దాడులు చేసి, నిందితులపై కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ దీపికా పాటిల్ మంగళవారం తెలిపారు. మద్యం, ఇసుక, గంజాయి, పశువులు అక్రమ రవాణా, కోడి పందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించారు. పోలీసులు, సెబ్ అధికారులు తనిఖీల్లో భాగంగా దాడులు నిర్వహించి, 14 కేసులు నమోదు చేసి, 14 మందిని అరెస్టు చేసి, 41.02 లీటర్ల IMFL మద్యం, 23 లీటర్ల ID యారక్ స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగించిన వారిపై 33 కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై 25 కేసులు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎస్పీ గారి ఆదేశాలతో పోలీసు అధికారులు వాహన తనిఖీలు చేపట్టి, ఎం.వి.నిబంధనలు అతిక్రమించిన 433 మందిపై రూ. 88,950/- లను ఈ-చలానాలు గా విధించారు. జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక, ఐపీఎస్ గారి ఆదేశాలతో పోలీసు అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక గ్రామాలు సందర్శించి, 2024 ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక, ఐపిఎస్ గారు పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి, వారి ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
