నంద్యాల, 4 జనవరి (హిం.స)
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ విభాగం కార్మికులు, తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిరవధికంగా సమ్మె కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా నంద్యాల పురపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ విభాగం కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను సమస్యలను పరిష్కరించాలని సమ్మెను చేపట్టారు.
నంద్యాల పురపాలక సంఘంలో ఏసి ఒప్పంద, పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని ఏఐటీ ఏపి యూసీ రాష్ట్ర కార్యదర్శి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకన్న, పురపాలక కార్మికుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రంజిత్, ప్రతాప్ హెచ్చరించారు. పురపాలక కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వ ర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు, మంత్రికి తెలియజేసినప్పటికీ సమస్యను పరిష్కరించకపోగా సమ్మెను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప సమస్యను సానుకూలంగా పరిష్కరించడంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంభించడాన్ని తీవ్రంగా విమర్శించారు.
హిందూస్తాన్ సమాచార్ ,సంధ్యా
