







అమరావతి, జనవరి 4(హిం స ): అసెంబ్లీ ఎన్నికల ముంగిట అధికార పార్టీ వైసీపీకి రాజకీయంగా భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ రాజకీయ నాయకులు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు.
వీరిలో ఎమ్మెల్సీ, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య, వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి సొంత బావమరిది, మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన ఇద్దరు కుమారులు, బాపట్ల నియోజకవర్గంలోని జడ్పీటీసీ సభ్యుడు పిట్ల వేణుగోపాలరెడ్డి తదితరులు ఉన్నారు. టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
