కళ్యాణదుర్గం, 23 డిసెంబర్ (హిం.స)
యువగళం ఓ విప్లవాన్ని సృష్టించి, ఒక మైలురాయిగా చరిత్రలో నిలిచిపోయిందని కళ్యాణదుర్గం టీడీపీ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు తెలిపారు.
ఈ రోజు శనివారం కళ్యాణదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ భవన్ లో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యువగళం ముగింపు సభకు వచ్చిన ఆ జన ప్రభంజనాన్ని చూసి, వైసీపీ పాలనకు దడ పుట్టిందన్నారు. ఆ జన సముద్రాన్ని చూసి జీర్ణించుకోలేక అవాక్కులు, చవాక్కులు పేలుతున్నారని విమర్శించారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
