తెలంగాణ : హైదరాబాద్ : డిసెంబర్27( హింస)
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేటితో ముగిసింది. తన నివాసం నుంచి విమానాశ్రయానికి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బయల్దేరారు. ఢిల్లీ నుండి హైదరాబాద్ రాగానే ప్రెస్ మీట్ లో రేవంత్ మాట్లాడనున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 12.30 గంటలకు సెక్రటేరియట్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ కు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపారు. ఆరు గ్యారంటీల దరఖాస్తును సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం, మంత్రులు విడుదల చేయనున్నారు. మంచు కారణంగా రేవంత్ రెడ్డి, భట్టివిక్రమార్క వెళ్లే ఫ్లైట్ కాస్త ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. అయితే హైదరాబాద్ లో అడుగుపెట్టగానే నేరుగా సీఎం, డిప్యూటీ సీఎం సచివాలయానికి రానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
