

శ్రీకాకుళం:27 డిసెంబర్ (హిం.స) తమ డిమాండ్ల పరిష్కారం కోసం గత కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు ఈరోజు మరో అడుగు ముందుకు వేశారు.
ఆందోళనలో భాగంగా బుధవారం ఉదయం రెవెన్యు మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. తమ సమష్యలు పరిస్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్మాన ప్రసాధరావు ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో పోలీసులకు అంగన్వాడీలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి ధర్మాన ప్రసాద్ ఇంటి వద్ద బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎండల్లో మేము ఏసీల్లో మీరా అంటూ నినాదాలు చేశారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
