హైదరాబాద్,, 02 జనవరి (హి.స.) :ప్రయాణికుల డిమాండ్ మేరకు ఎస్‌ఎంవీటీ బెంగళూరు-బీదర్()మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే( అధికారులు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈనెల 2 నుంచి ఫిబ్రవరి 27వరకు (శుక్ర-ఆదివారం) ఎస్‌ఎంవీటీబెంగళూరు-బీదర్ (06539) మధ్య 17 ట్రిప్పులు, ఈనెల 3 నుంచి ఫిబ్రవరి 28 వరకు (శని-సోమవారం) బీదర్-ఎస్ఎంవీటీ బెంగళూరు(06540) మధ్య 17 ట్రిప్పులు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు పేర్కొన్నారు.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
