తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ డిసెంబర్:23(హిం స) ఎంతో చరిత్ర గల ప్రభుత్వ జూనియర్ కళాశాల దుస్థితి నేడు చూస్తుంటే కడుపు తరుక్కోపోతుందని గత ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
షాద్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే శంకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపల్, బోధన సిబ్బందిలతో సమావేశమై వారితో మాట్లాడారు.
అంతకుముందు కళాశాల పరిసరాలను ప్రత్యేకంగా పరిశీలించారు. బాట్ని, జువాలజీ, కెమిస్ట్రీ ల్యాబులను పరిశీలించారు. దుమ్ము ధూళితో పేరుకుపోయిన చెత్త చెదారం ఫర్నిచర్ పరికరాలు చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. కళాశాల అటెండెన్స్ రిజిస్టర్ చూసి సిబ్బంది ఎక్కడ? ఉన్నారని ప్రశ్నించారు.
జనార్దన్ రెడ్డి, హిందుస్థాన్ సమాచార్
