నిర్మల్, 11 నవంబర్ (హి.స.)
నిర్మల్ జిల్లా ఉట్నూర్ పట్టణంలో పొద్దు పొడుపు బొజ్జన్న అడుగు కార్యక్రమంలో భాగంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మంగళవారం మార్నింగ్ వాక్ లో మెయిన్ రోడ్ లో పర్యటించారు. ప్రజలతో ముచ్చటిస్తూ, వారి సమస్యలు తెలుసుకున్నారు. సమస్య ఉన్న చోట వెంట ఉన్న అధికారులను పరిష్కరించాలని ఆదేశించారు. పర్యటనలో ఇల్లులేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం దిశగా ప్రణాళిక చేశారు. అవసరం ఉన్న చోట ట్రాన్స్ఫార్మర్లు, నూతన వాటర్ ట్యాంక్స్, అంగడి బజార్, ఐబీ ప్రాంతాల్లో సులభ్ కాంప్లెక్స్ ల నిర్వహణకు స్థలం పరిశీలించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు
