శ్రీశైలం, 24 డిసెంబర్ (హిం.స)
కార్తీకమాస శివదీక్షా విరమణ కార్యక్రమం ఆదివారం ఉదయం నుంచి ప్రారంభిస్తున్నట్లు డి. పెద్దిరాజు తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. పాతాళగంగ మార్గములోని శివ దీక్షా శిభిరాలలో దీక్షా విరమణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
నవంబర్ 14న శివ మండల దీక్షను, డిసెంబర్ 3న అర్ధమండలదీక్షనుస్వీకరించిన భక్తులు ఈ దీక్షా విరమణ సమయంలో దీక్షను విరమించవచ్చన్నారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
