హైదరాబాద్, 4 ఆగస్టు (హి.స.)
రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. బీఆర్ అంబేడ్కర్, జ్యోతీరావ్ ఫులే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు నివాళి అర్పించారు. దీక్ష సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. నీళ్లు కూడా తాగకుండా దీక్షలో కూర్చుంటా అని, కాదని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి పంపినా లేదా ఇంటికి పంపినా అక్కడ కూడా దీక్ష చేస్తా అని హెచ్చరించారు.
‘ఇందిరా పార్క్ వద్ద ఇంతమంది వచ్చి ధర్నా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆలోచన చేయాలి. ఇక్కడికి వచ్చిన వారందరికీ వ్యక్తిగత పనులు
ఉన్నాయి. అయినా అవన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చాము. రాజకీయంగా అందరికీ ప్రాధాన్యత దక్కాలి. జనాభాలో సగం జనాభా ఉన్న బీసీలకు సరైన రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్తో ఇక్కడ దీక్ష చేయడానికి వచ్చాము. ఇది రాజకీయ పోరాటం కాదు.. బీసీల ఆత్మగౌరవ పోరాటం అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..
