పుట్టపర్తి, 3 జనవరి (హిం.స)
సత్య సాయి జిల్లా వ్యాప్తంగా గల యుటిఎఫ్ నాయకులు ఈ రోజు బుధవారం నిర్వహిస్తున్న 12 గంటల ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సత్యసాయి జిల్లా యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్ర రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయ ఆవరణంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
హిందూస్తాన్ సమాచార్, సంధ్యా
