

ఏలూరు జిల్లా26 డిసెంబర్ (హిం.స): రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా ఏలూరు మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు డిమాండ్ చేశారు.
మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
