అమరావతి, 9 సెప్టెంబర్ (హి.స.)
హైదరాబాద్: అక్రమ నిర్మాణానికి సంబంధించి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ()కు జీహెచ్‌ఎంసీ ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అల్లు కుటుంబం.. జూబ్లీహిల్స్‌లో ‘అల్లు బిజినెస్ పార్క్’ జీ హెచ్ ఎం సుభవవాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే. నాలుగు అంతస్తుల వరకు జీహెచ్‌ఎంసీ అనుమతి ఇచ్చింది. దానిపై అదనంగా పెంట్‌హౌస్ నిర్మించడంతో తాజాగా చర్యలకు దిగింది. ఆ భవనంపై అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయరాదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసులు పంపింది. రెండేళ్ల క్రితం నిర్మితమైన ‘అల్లు బిజినెస్ పార్క్’లో గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
