ఆంధ్రప్రదేశ్ : అమరావతి: డిసెంబర్28( హింస)
జనవరి నెలలో చేపట్టనున్న మూడు కీలక పథకాల అమలుపై వైఎస్ జగన్ సర్కార్ ఫోకస్ పెట్టారు.. జనవరి నెలలో మూడు వేల రూపాయలకు పెన్షన్ పెంపు, చేయూత, ఆసరా పథకాల అమలువైపు అడుగులు వేస్తున్నారు.. అందులో భాగంగా ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కార్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గననున్నారు సీఎం వైఎస్ జగన్.. పథకాల అమలు, లబ్దిదారుల భాగస్వామ్యం తదితర అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
