తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 1( హింస)
తెలంగాణ ప్రజలకు నూతన శకం మొదలైందని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజలందరికీ హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 60 ఏళ్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటం తర్వాత 2014 కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేసిందన్నారు. ప్రజలకు రాష్ట్రం వచ్చింది కానీ దురదృష్టవశాత్తు టిఆర్ఎస్ ప్రభుత్వం రావడం ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్రం రాలేదన్నారు. పదేళ్ల నిర్బందాలు, నియంత పాలనను పారద్రోలి ప్రజలు మళ్ళీ ఒక ప్రజాస్వామ్య పాలనకు అంకురార్పణ చేశారని అన్నారు. ప్రజా పాలన మొదలు కావడంతో స్వచ్ఛగా బతుకుతున్నారు. రాష్ట్రములో ఒక పండుగ వాతావరణం ఏర్పడిందన్నారు. సచివాలయంలో ప్రజలు స్వేచ్ఛగా వచ్చి వారి విజ్ఞప్తులను అందజేస్తున్నారని తెలిపారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
