ఢిల్లీ,28,,డిసెంబర్ (హిం.స) తమిళ నటుడు డీఎండీకే అధినేత విజయకాంత్ మృతి పట్ల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం బాధాకరం.. తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఆయన ఒక లెజెండ్ అని పేర్కొన్నారు. తన నటనతో కోట్ల మంది అభిమానులను విజయకాంత్ సొంతం చేసుకున్నారు.. రాజకీయ నాయకుడిగా ప్రజా సేవలో నిమగ్నమయ్యారు.. తమిళనాడు రాజకీయాలను విజయకాంత్ ఎంతో ప్రభావితం చేశారని ప్రధాని అన్నారు. డీఎండీకే అధినేత విజయకాంత్ నాకు మంచి మిత్రుడు అని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
హిందుస్థాన్ సమాచార,నాగరాజ్
