హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.)
బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసి భారీ విజయం దిశగా దూసుకెళ్తాంది. సర్వే ఫలితాలకు అనుకూలంగానే ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంది.
ఇక తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన జానపద గాయని మైథిలి ఠాకూర్ కూడా విజయం దిశగా వెళ్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లో ముందంజలో ఉన్న ఆమె.. ఈవీఎంల కౌంటింగ్లో కూడా ఆదిక్యంలో దూసుకెళ్తున్నారు. ఆర్జేడీ సీనియర్ నేత బినోద్ మిశ్రా ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. వాస్తవంగా అలీనగర్ స్థానం అనేది ఆర్జేడీకి కంచుకోట లాంటిది. ఈ నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి ఆర్జేడీనే గెలుచుకుంటూ వస్తోంది. ఈసారి మాత్రం యువ ఓటర్లంతా మైథిలి ఠాకూర్ వైపు మొగ్గు చూపినట్లుగా కనిపిస్తోంది. మైథిలి ఠాకూర్ గెలిస్తే.. అతిపిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందనుంది.
—————
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..
