ఢిల్లీ,29,,డిసెంబర్ (హిం.స) : దేశంలో కోవిడ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 797 కొత్త కోవిడ్-19 కేసులు నమోదు కాగా.. ఐదుగురు మృతి చెందారు. దేశంలో 4,097కి యాక్టివ్ కేసులున్నాయి. కేరళలో రెండు, మహరాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడులో ఒక్కో మరణం నమోదైంది. ఏపీలో 25, తెలంగాణలో 9 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో 54, తెలంగాణలో 64 యాక్టివ్ కేసులున్నాయి. ఢిల్లీలో తొలి జేఎన్.1 వేరియంట్ కోవిడ్ కేసు నమోదైంది.
హిందుస్థాన్ సమాచార,నాగరాజ్
