ఢిల్లీ, 14 జనవరి (హిం.స)
ప్రధాని నరేంద్ర మోదీ సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన వేడుకలకు ప్రధాని హాజరు అయ్యారు. సంప్రదాయ దుస్తులను ఆయన ధరించారు. తెల్ల లుంగి, నల్ల కోటును ధరించిన మోదీ దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ సందర్భంగా కట్టెల పొయ్యిపై పాయసం వండారు. గోమాతకు సారె సమర్పించి పూజ చేశారు.
‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ యొక్క భావోద్వేగాన్నిపొంగల్ పండుగ వర్ణిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. తన సొంత బంధువులతో కలిసి పొంగల్ను జరుపుకుంటున్నట్లు తాను భావిస్తున్నట్లు అన్నారు.. అందరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, సంతృప్తి ప్రవహించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
